వామ్మో... అయ్యో... కరోనా వస్తుంది… ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగానిద్రలేకుండా చేస్తున్న విషయం. దీనికోసం మన పాలకులు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆ కొంత భయాన్ని మరిచిపోయే విధంగా ప్రయత్నాలు చెయ్యాలి. రాష్ట్ర ప్రజలు కానీ లేక దేశ ప్రజలు కానీ లేదా మరి ఏ దేశం కానీ అది ఎవరైనా ఎక్కడి వారు అయినా సరే, ప్రజల్లో ఒక్కసారి భయం మొదలైందంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. నిజానికి మన దేశంలో కొంత మంది అమాయక జనం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేక పోలేదు. 

 

 


అయితే ఈ విషయాన్నీ గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహం మార్చారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 7 తర్వాత కరోనా అనేది ఉండదని, మీడియా అనవసరంగా ఈ విషయాన్నీ సీన్ చేయవద్దు అని కేసీఆర్ ప్రకటించారు. రాబోయే నెల 7 తర్వాత తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా ఎవరికి రాదని కూడా ఆయన ధైర్యాన్ని ప్రజలికి ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరూ కూడా భయపడవద్దు అంటూ అని చెబుతూనే కరోనా కట్టడికి చెయ్యాల్సినవి ఆయన చేస్తున్నారు. నిజానికి ఆయన రైతుల గురించి చెప్పిన మాటలు మాత్రం నిజంగా అభినంధించేవి అనడంలో అతిశయోక్తి లేదు.

 

 


అనవసరంగా కంగారు పడి ఒకరి మీద ఒకరు పడకుండా ధాన్యం, ఇతర పండించిన వస్తువులు అమ్ముకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ సీరియస్ గా మాట్లాడినా, ఎలా చెప్పినా సరే ప్రజల్లోకి ఆయన ఏం చెప్పాలి అనుకున్నారో, ప్రజలకు ఏం కావాలో అది స్పష్టంగా అర్ధం అవుతుంది. నిజానికి ఆయన మాటలు వింటుంటే ఇంట్లో మనిషి ధైర్యం చెప్పినట్టు చెప్తున్నారు కేసీఆర్. ప్రస్తుతానికి దేశంలో ఈ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తారు. నిజానికి కరోనా మీద చాలా మంది ముఖ్యమంత్రులు మీడియా సమావేశాలని పెట్టాలంటే భయపడుతున్నా కేసీఆర్ మాత్రం భయపడటం లేదని మనం గ్రహించవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు మాటలతోనే కొండంత సహాయం చేస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple:  https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: