ప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న కరీనా మహమ్మారి బ్రిటన్‌ను భయపెడుతోంది. గత మూడు రోజులుగా ఈ వైరస్ కారణంగా ఇక్కడ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.  నిన్న ఒక్క రోజే అక్కడ 708 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఒకే రోజు ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మృతుల్లో ఐదేళ్ల బాలుడు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో ఒక్కరోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇవే అత్యధికం. 

 

దీంతో బ్రిటన్ లో కరోనా మరణాల సంఖ్య 4,313కు చేరింది. బ్రిటన్ లో మొత్తం 41,903 మందికి ఈ వైరస్ సోకింది.  ఇక, దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 41,903 మంది వైరస్ బారిన పడగా 4,313 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే బ్రిటన్ వ్యాప్తంగా 3,735 కేసులు నమోదవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న మరణించిన వారిలో 40 మందిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది.  

 

 దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఇటివలే కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. అలాగే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలను సడలిస్తే మరింతమంది మృత్యువాత పడే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్‌ హ్యాన్‌కాక్ పేర్కొన్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: