అతివాద భావాజాలాన్ని ప్ర‌ద‌ర్శించే రాజ్‌థాక్రే.. ఘజియాబాద్‌లోని  ఆసుపత్రిలో కొందరు కరోనా బాధితులు అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులతో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వార్త‌లు రావ‌డంతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి వారిని ఇంకా ప్రాణాల‌తో ఎందుకు ఉంచుతున్నారు...నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయ‌కా అంటూ ఆగ్ర‌హాన్ని వెల్ల‌గ‌క్కారు. ఆసుపత్రిలో చేరి నర్సులను వేధించిన వారిని కాల్చి చంపాలని థాక్రే  ప్ర‌భుత్వానికి సూచించారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ వైద్య సేవ‌లందిస్తున్న వారిని ఇంకా ఎందుకు ఉంచ‌డం అంటూ ఘాటుగా స్పందించారు.

 

త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల కార‌ణంగానే క‌రోనా దేశంలో విస్త‌రించింద‌ని ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో రాజ్‌థాక్రే భిన్నంగా స్పందించారు. ఇప్పుడు మ‌తాల గురించి మాట్లాడే స‌మ‌యం కాద‌ని శాంతియుత వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కొంద‌రు ఏమాత్రం పాటించ‌క‌పోవ‌డంపై మండిప‌డ్డారు. అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని అన్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జానీకానికి స‌హాయ‌ప‌డుతున్న ప్రతీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌తులు తెలిపారు. ఎం ఎన్ ఎస్ త‌రుపున స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

 

ఇదిలా ఉండ‌గా మ‌హారాష్టలో రోజు రోజుకు క‌రోనా ఉధృతికి పెరుగుతోంది. వ్యాధి నియంత్ర‌ణ‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర‌మైన ఆంక్ష‌లు విధించింది. ముంబై మ‌హానగ‌రం లాక్‌డౌన్ కార‌ణంగా నిర్మానుష్యంగా మారింది. దేశ ఆర్థిక రాజ‌ధానిగా పేరుగాంచిన ముంబైని ఈ ప‌రిస్థితుల్లో గ‌డిచిన శ‌తాబ్ధ‌కాలంలో ఎప్పుడూ ఇలా చూడ‌లేద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ‌గా ఉన్న ధార‌విలో క‌రోనాతో ఒక‌రు మృతిచెంద‌డంతో ఇప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే అక్క‌డి నుంచి వేలాదిమందిని క్వారంటైన్‌కు ప్ర‌భుత్వం త‌ర‌లించింది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: