తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగి పోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో  రోజురోజుకు ప్రాణభయం బతుకు పోతుంది. కొంత మంది ప్రజలు నిర్లక్ష్యం కారణంగా ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. ఎక్కువ మొత్తంలో ప్రజలు కరోనా  వైరస్ తమ  దరి చేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలు సూచనలు పాటిస్తుంటే కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఈ వైరస్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

 

 

 అయితే చాలామంది కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడికి కరోనా  వైరస్ లక్షణాలు కనిపించగానే... ముందస్తు జాగ్రత్తగా ఈ నెల 3వ తేదీన ఉదయం పరీక్షలు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఉదయం జరిగిన పరీక్షల్లో ఆ యువకుడికి కరోనా వైరస్ లేదు అని వచ్చింది. దీంతో ఆ యువకుడు ఎంతో ఆనంద పడ్డాడు. కానీ అతని ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సాయంత్రం సమయానికి వచ్చిన మరో రిపోర్టులో అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన రెండు  రిపోర్టులు  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. 

 

 

 గంటల వ్యవధిలో కరోనా వైరస్ పై రెండు రిపోర్టులో రెండు రకాలుగా రావడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే కరోనా వైరస్ పేరెత్తితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగటం  పై ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే జరిగిన ఘటనపై స్పందించిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కనకాద్రి ... వివరణ ఇచ్చారు. సదరు యువకుడికి కరోనా  వైరస్ సోకింది అంటూ తేల్చారు. సాంకేతిక సమస్యల కారణంగా... తొలుత వచ్చిన రిపోర్టులో కరోనా  వైరస్ గురించి తప్పుగా నిర్ధారణ అయ్యింది అంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత తప్పులు సరిచేసుకొని కరోనా  వైరస్ సోకినట్లుగా  నిర్ధారించినట్లు ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: