కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అన్ని చోట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.. ఈ దశలో వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టడమే మార్గం.. ఈ దిశగా ప్రతి వ్యక్తి ఆలోచించి అడుగులు వేయాలి.. లేదంటే మనచేతితో మన కళ్లు పొడుచుకున్నట్లుగా, మన కష్టాలకు మనమే కారకులం అవుతాము.. ఎందుకంటే గోతిలో పడ్ద మనమే. అందులో నుండి బయటపడ్ద మనమే.. కానీ ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఆలోచించవద్దు..

 

 

దేశ, రాష్ట్ర ఆర్ధికపరిస్దితి దిగజారినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి.. వాటిని పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో సామాన్యుల మీద భారాన్ని మోపుతాయి.. ఇకపోతే కరోనా వ్యాపిస్తున్న నేపధ్యంలో కొందరు చదువుకున్న వారు కూడా వ్యాధి లక్షణాలు కొంత కనపడగానే జాగ్రత్తలు పాటించడం లేదు.. దీని ఫలితంగా అది మరికొంత మందికి వ్యాప్తి చెందుతుంది.. ఇకపోతే అదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఇక్కడ ఇప్పటికే 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో 25 మందికి సంబంధించి వైద్య నివేదికలు ఆదివారం వెల్లడి కానున్నాయి.

 

 

కాగా బాధితులంతా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లేకావడంతో ఏజెన్సీలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా రిమ్స్ ఆసుపత్రిలో ఒక వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చాల మంది ఇబ్బందుల్లో పడ్దారు... బాధ్యత గల వృత్తిని చేపట్టిన ఈ వైద్యుడు బాధ్యత మరిచాడు.. తాను మర్కజ్ వెళ్లి వచ్చి విషయాన్ని గోప్యంగా ఉంచి... రెండు రోజుల క్రితం వరకూ డ్యూటీలోనే ఉన్నాడు. ఇక ఎలాగో విషయం తెలుసుకున్న అధికారులు ఆ వైద్యుడిని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో  రిమ్స్ వైద్య సిబ్బందిలో ప్రస్తుతం ఆందోళన నెలకొంది..  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: