ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 194కు చేరింది. రాష్ట్రంలో కరోనా భారీన పడి ముగ్గురు మృతి చెందారు. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా విషయంలో వైసీపీ తడబడుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి ముందస్తు చర్యలు చేపట్టినా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కొంతమంది ప్రజలు విమర్శలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాలంటీర్లు, ఆశా వర్కర్లు సర్వేలు సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 
జగన్ రెండు మూడు రోజులకొకసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నా సీఎం ప్రజల్లో మరింత స్పూర్తి నింపాల్సిన అవసరం ఉంది. సీఎం, ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు మినహా అధికార పార్టీ నుంచి కరోనా గురించి మాట్లాడేవారే కరువయ్యారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నా ప్రజల్లో శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో ఎందుకో విఫలమవుతోంది. పాజిటివ్ కేసుల వివరాలు, మృతుల వివరాలకు సంబంధించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరింత కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీ కొన్ని విషయాల్లో వెనుకబడిందని బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి రావాలని... ప్రజల్లో స్పూర్తి, ధైర్యం నింపాలని... కరోనా గురించి పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని కోరుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: