ప్రస్తుతం కరోనా  వైరస్ అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఇక ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో... ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏం చేస్తే కరోనా వైరస్ దరిచేరకుండా ఉంటుంది అనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అందరు ప్రజలు. ఈ క్రమంలోనే  ప్రజలను అయోమయంలో పడవేసే విధంగా ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వార్త హల్చల్ చేస్తోంది. వేడి వేడిగా ఉండే కాఫీ టీలు లాంటివి తాగడం వల్ల కరోనా  వైరస్ నశిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. 

 

 

 మామూలుగా అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అందరూ టీ కాఫీలు తాగుతూ ఉంటారు కానీ ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో వేడివి తాగాలంటే  అస్సలు నచ్చదు కానీ కరోనా  వైరస్ ను  నాశనం చేయాలంటే తాగాలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్  నోరు ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించిన తర్వాత మూడు రోజులపాటు శ్వాసనాళంలోకి ఉంటుందని... ఈ మూడు రోజుల సమయంలో వేడి నీరు,  టీ, కాఫీ, గ్రీన్ టీ, పసుపు వేసుకుని నీళ్లు తాగడం ద్వారా కరోనా  వైరస్ పొట్టలోకి వెళ్ళిపోయి అక్కడ అన్నవాహికలో విడుదలయ్యే గ్యాస్ట్రిక్  ద్వారా చచ్చిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 

 

 అయితే దీనిపై స్పందించిన వైద్యులు ఇదంతా నమ్మవద్దు అంటూ చెబుతున్నారు. కాఫీ టీలు లాంటివి తాగితే కరోనా  నశిస్తుందని ఆధారాలు ఎక్కడా లేవు అంటూ చెబుతున్నారు. మనిషి శరీరంలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని... అంత వేడిగా ఉన్నప్పుడే కరోనా  వైరస్ బతికే ఉంటుంది అంటూ చెబుతున్నారు. అందువల్ల వేడి డ్రింక్ తాగి నప్పటికీ కారణం వైరస్ మాత్రం నశించదు అంటూ సూచిస్తున్నారు. బాడీ లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటితే మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. టీ, కాఫీగ్రీన్ టీ లాంటివి రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి తప్ప కరోనా  వైరస్ ను మాత్రం ఆపలేవు అంటున్నారు. ఇలా వేడి వేడి పదార్థాలు తాగడం వల్ల కరోనా వైరస్ చావదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: