క‌రోనా క‌ట్ట‌డిలో మిగ‌తా రాష్ట్రాల క‌న్నా తెలంగాణ రాష్ట్రం ఓ రెడండుగులు ముందే ఉంటోంది . ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న డేర్ అండ్ డాషింగ్ నిర్ణ‌యాల‌తో అధికారులు కూడా లాక్‌డౌన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లుగు తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు కొర‌త లేకుండా చూడ‌టంలో స‌ఫ‌లం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక రైతులు పండించిన ధాన్యం, మొక్కొజొన్న కొనుగోలుకు ఇటీవ‌ల గ్రామాల్లో కేంద్రాల‌ను కూడా ప్రారంభించారు. దీంతో ఎక్క‌డా రైతాంగంలో అసంతృప్తి రాకుండా చూసుకున్నారు. వాస్త‌వానికి ఇది ఇప్పుడు చాలా అవ‌స‌రం కూడా.


తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న తీరుపై నివేదిక తెప్పించుకున్న‌ ప్ర‌ధానిమోదీ కూడా కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపార‌ట‌. మీరు మిగతా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారంటూ కితాబిచ్చారంట‌. అలాగే కేసీఆర్ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌ను కూడా ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సూచించినట్లు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా కేసీఆర్ నుంచి ప‌లు సూచ‌న‌లు పొందుతున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డం,క‌రోనా కొత్త కేసుల్లో మొత్తం వాళ్లే ఉంటున్న విష‌యం తెలిసిందే. 

 

అయితే ఇప్పుడు వాళ్లంద‌రిని గుర్తించేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే హాట్ స్పాట్ల మ్యాపింగ్‌ను అమ‌ల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో 25 క‌రోనా హాట్ స్పాట్ల‌ను గుర్తించి ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ఆరోగ్య సేవ‌లందిస్తున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో 50 హాట్ స్పాట్ల‌కు మ్యాపింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క‌ఠిన నిర్ణ‌యాల అమ‌లుతో పాటు కరోనా వ్యాధి నివార‌ణ‌కు అన్ని కోణాల్లో క‌ట్ట‌డికి వేగంగా ముందుకు కదులుతుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌తో క‌రోనా అదుపులోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం బ‌ల‌ప‌డింది. అందుకే ప్ర‌భుత్వం ఏం చెప్పినా వెంట‌నే ప్ర‌జ‌లు పాటిస్తుండ‌టం కేసీఆర్ చ‌రిష్మాకు నిద‌ర్శ‌న‌మంటూ ప‌లువురు రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: