ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో విస్తరించకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా గల దేశం అయిన ఇండియాలో వ్యాప్తి చెందుతూ మరణాలు లక్షల్లో ఉంటాయని లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు ప్రధాని మోడీ. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్  గట్టిగానే విధిస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం కరోనా పై యుద్దం విషయంలో మొదటిలో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ జాతీయ మీడియాలో మరియు జాతీయ నాయకులలో మంచి పేరు సంపాదించారు.

 

దేశంలో వైరస్ ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా వ్యాప్తి ఎక్కువగా చెందటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశాల నుండి వచ్చిన వాళ్ళని చాలా త్వరగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గుర్తించి వాళ్లను ఇంటికే పరిమితం చేశారు. 14 రోజులు వాళ్ళ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఎక్కడికక్కడ గట్టి చర్యలు చేపట్టారు. అయితే ఎప్పుడైతే నిజాముద్దీన్ దర్గా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ పాజిటివ్ రిజల్ట్స్ రావటంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా మారిపోయింది.

 

ఢిల్లీ ప్రార్థనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య మూడిపడి ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారిని గుర్తించటంలో జగన్ సర్కార్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చివరాకరికి వాళ్లందరినీ గుర్తించిన...ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కొద్దీ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జగన్ డీలా పడిపోయినట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి టైం లో ఇంతలా ఢీలా పడటం ఏంటి అంటూ చాలామంది పార్టీలో డిస్కషన్ చేసుకుంటున్నారు. మరికొంత మంది ఎంత చేసినా గాని ఉన్న కొద్ది పాజిటివ్ కేసులు రావడంతో ఏం చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి కి ఎదురైందని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: