ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు 34 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదు కాగా చిత్తూరులో 7, నెల్లూరులో 2, ఒంగోలులో 2 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 226కు పెరిగింది. ఏపీలో కరోనా కట్టడి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా కాకుండా పనే దైవంగా ముందుకెళుతున్నారు. జగన్ రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి ఎంత కృషి చేస్తున్నా మీడియా నుంచి సహకారం అందట్లేదు. కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నాయి. సీఎం జగన్ పని ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. 
 
చంద్రబాబులా ప్రచారం కోసం కష్టపడకుండా పనే దైవంగా భావించి కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎం లు, ఆర్పీల సహాయంలో నిరంతరం సర్వేలు నిర్వహిస్తూ ఎవరిలోనైనా దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపించినా వారికి వెంటనే వైద్య చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు కరోనా అనుమానితులను ఐసోలేషన్ వార్డులకు, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
ఎక్కడైనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ ప్రాంతాలను ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకొని కొత్త కేసులు నమోదు కాకుండా సీఎం చర్యలు చేపడుతున్నారు. సీఎం ప్రచారం కంటే పనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నా ప్రజల్లో కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు. పనే దైవంగా కష్టపడుతున్న సీఎం జగన్ స్ట్రాటజీ ఫలిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: