ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2014 నుండి 2019 వరకు టిడిపి ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం పక్కన పెడితే... చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఖజానా ని దివాలా తీసి, ఉన్న సంపదను దోచుకుని... లేని అప్పులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై మోపడం జరిగింది. 2019 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా ఎన్నుకోబడ్డారు. అనంతరం అట్టడుగు కి చేరుకున్న ఏపీ ఆర్థిక వ్యవస్థను తన భుజాలపై వేసుకొని పైకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా... ప్రజలందరినీ తమ సొంత మనుషులుగా చూసుకుంటూ వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్ లను ఏర్పాటు చేసి ఇంటింటికి పెన్షన్ లాంటి మెచ్చుకో దగ్గ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపించే దేవుడిలా మారాడు జగన్. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు అవుతున్నప్పటికీ... కరోనా మహమ్మారి వలన టాక్స్ ల రూపంలో వచ్చే డబ్బులు ప్రస్తుతం రాకపోయినా... ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా శాలరీలు ఇస్తున్నారు జగన్. మరి ఇటువంటి గడ్డు పరిస్థితులలో సంక్షేమ పథకాలు సాధ్యమా అని ప్రతి ఒక్కరి మనసులో ప్రశ్న రాకమానదు.


ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తూ బలహీనమైన ఏపీ ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తుంటే దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ... మరోవైపు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎదురవుతున్నా... జగన్ మాత్రం కొంచెం కూడా అధైర్య పడకుండా తన రాష్ట్రాన్ని తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏపీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమవుతే... ఆ రాష్ట్ర దేవాలయ సంపదలను వాడుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ మళ్ళీ దారిలోకి వచ్చిన తర్వాత... దేవుని సంపదను దేవునికి తిరిగి ఇచ్చేయవచ్చు. అయినా ప్రతి దేవుడు ఉన్నది ప్రజలను కాపాడటానికే కదా.


ఇకపోతే కేంద్రం నుండి నిధులు వస్తాయా అంటే... ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మంచిదే. అందుకే జగన్ మోహన్ రెడ్డి కేంద్రం నుండి డబ్బులు రాబట్టడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో తాకట్టు పెట్టడానికి బాండ్లు గానీ ల్యాండ్ లు కానీ ఏమీ మిగల్చలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలను ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ బ్యాంకుల నుండి అప్పు తీసుకున్నా ఏమాత్రం తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడడం కేవలం జగన్ మోహన్ రెడ్డి మాటలు చేతలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే జగన్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అధికారులు పాటించాలి. ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రజల సంక్షేమం కొరకే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తారు. అలాగే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు జగన్ ఇప్పటికే ఎన్నో ప్రణాళికలను రూపొందించుకున్నాడని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ సూచనలను పాటిస్తే ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలో ఆయన ఒక్కడే చూసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: