ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌క‌ట్ట‌డికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎప్ప‌టిక‌ప్పుడు దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తూ త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను అందిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే.. లాక్‌డౌన్ అమ‌లు, ఈ స‌మ‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై కూడా ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ దిశానిర్దేశం చేసింది. భార‌త్‌లో మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లు ప‌క‌డ్బందీగా పాటించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా నిరంత‌రం సూచిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చూచించిన స‌ల‌హాలు, సూచ‌ల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా భార‌త్ పాటిస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా నాలుగు ద‌శ‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు అవేమిటో చూద్దాం..

 

క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మార్చి 22వ తేదీన జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునివ్వ‌గా.. ప్ర‌జ‌లు విజ‌యంవంతం చేసిన విష‌యం తెలిసిందే. దీనిని లాక్‌డౌన్‌కు ముందు ట్ర‌య‌ల్ అని చెప్పొచ్చు. ఆ త‌ర్వాత మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌ధాని దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.  ఇక ఆ త‌ర్వాత ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్ 20 నుంచి మే 18వ‌ర‌కు అంటే 28రోజుల‌పాటు రెండో లాక్‌డౌన్ విధించే అవ‌కాశ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌.. ఈ స‌మ‌యంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య జీరోకు వ‌స్తే.. లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తేస్తారు. లేకుంటే.. మే 19 నుంచి 24వ‌ర‌కు మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు లాక్‌డౌన్ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తారు. ఆ త‌ర్వాత మే 25 నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు చివ‌రి లాక్‌డౌన్ విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. సోష‌ల్ మీడియాలో కూడా జూన్ 10వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: