కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైయస్ జగన్ సర్కార్ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. దేశంలో వైరస్ వచ్చిన ప్రారంభంలో నమోదైన పాజిటివ్ కేసులు ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారివి కావడంతో చాలా రాష్ట్రాల్లో ఫెయిల్ అయితే జగన్ సర్కారు మాత్రం వాళ్ళని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చాలా తొందరగా గుర్తించి వైరస్ ప్రబలకుండా అరికట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఒకపక్క కఠినంగా అమలు చేస్తూనే మరో పక్క వైరస్ ప్రబలకుండా ప్రారంభంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వైరస్ ను కట్టడి చేయగలిగారు.

 

అయితే ఎప్పుడైతే నిజాముద్దీన్ దర్గా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా కూడా అనేక పాజిటివ్ కేసులో ఢిల్లీ కేంద్రంగా నమోదు అయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్ ని విమర్శించడానికి కారణం కోసం ఎప్పటినుండో కాచుకుని కూర్చుని ఉన్న విపక్షాలు ఒక్కసారిగా దుమ్మెత్తి పోయేలా విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కార్ సరైన ఈ విధంగా కరోనా వైరస్ కట్టడి చేయడంలో పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నారు.

 

అయితే ఎన్నికల టైంలో బాగా యాక్టివ్ గా పనిచేసిన వైసిపి సోషల్ మీడియా ప్రస్తుతం విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎందుకు కౌంటర్లు ఇవ్వటం లేదని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. లోకల్ లో గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల వరకూ అందరూ కష్ట పడుతున్నారు .. అయితే సోషల్ మీడియా విషయం లో యాక్టివ్ గా ఉండాల్సిన లోకల్ క్యాడర్ మాత్రం జగన్ కి దూరంగా ఉంటోంది అని టాక్ నడుస్తోంది. వారికి అందాల్సిన బెనిఫిట్ లు అందలేదు అనేది ఇక్కడ ఉన్న ఆరోపణ . పార్టీ కీ ప్రభుత్వానికీ ఒకప్పుడు ఎలక్షన్ ముందర విపరీతంగా యాక్టివ్ గా ఉన్న సోషల్ మీడియా వర్కర్ లు ఇప్పుడు దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: