గత పది నెలలు అనేక ప‌థ‌కాలు చేప‌ట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కాస్త ఊర‌ట‌నిచ్చే ప‌రిస్థితి వ‌చ్చింది అనుకోవచ్చు. అనేక సార్లు కేంద్రంతోనూ, ఇంకా ఆర్థిక సంఘం చైర్మ‌న్‌ ల‌తోనూ జ‌గ‌న్ స‌ర్కారు పెద్ద‌లు పెట్టుకున్న మొర మంచి ఫ‌లితం వచ్చింది. ఇదే క్ర‌మంలోనే ఏపికి రావాల్సిన నిధులు వ‌చ్చాయి. దీనితో ఇక‌, మ‌రికొన్ని కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను కొనసాగించాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు.

 

 

ఇంత వరకు అంతా బాగా ఉన్న అనూహ్యంగా వ‌చ్చిన క‌రోనా వైర‌స్ కార‌ణంగా... పరిస్థితి మొత్తం మారిపోయింది. అనుకున్నది ఒకటి అయ్యేది ఇంకొకటి అన్నట్టూ... అనుకున్న విధంగా కాకుండా అద‌న‌పు ఖ‌ర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. అయితే ఇక‌, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు రెవెన్యూ లోటు భర్తీ అయిందంట. అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కోసమై అడ్వాన్స్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. 

 

 


15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ లోటును భర్తీ కింద ఏప్రిల్‌ మాసానికి కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్లను విడుదల చేసింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కోసమని రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఈ పరిస్థితులలో ఏప్రిల్‌ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద ఏపీ కి 15వ ఆర్థిక సంఘం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,491 కోట్లను రాష్ట్రానికి ఇవ్వాలని కోరింది. దీనితో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం తెలియ చేసింది. 

 

 


ఇలాంటి స్థితిలలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌ గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ బాగానే విడుదల చేసింది. దీనితో ముందుగా అనుకున్న అంచ‌నాల ప్ర‌కారం.. శ్రీకాకుళం జిల్లాతో పాటు అనావృష్టితో ఇబ్బంది ప‌డుతున్న ప్రాంతాల్లో ఈ నిదులు ఖర్చు చేయాలని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు క‌రోనా వైరస్ కార‌ణంగా ఆ నిధుల‌ను క‌రోనా ప్ర‌భావం తగ్గించి ఎక్విప్‌మెంట్ల‌కు ఉపయోగించాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనితో జ‌గ‌న్ చేసిన కృషి ఫ‌లించినా.. క‌రోనా వైరస్ ఈ క‌ష్టాన్ని మొత్తాన్ని ఇంకో వైపుకు మళ్లిచ్చిందని వాద‌న బ‌లంగా వినపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: