దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు ప్రజల్లో ప్రాణ భయాన్ని కలిగిస్తూ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ మహమ్మారి. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ప్రజలకు కరోనా  వైరస్ పై  మరింత భయాన్ని పెంచుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న.. ఎన్నో  కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి.  అయితే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. 

 

 

 ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు  సమావేశం ఏర్పాటు చేసి  కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో కరోనా  వైరస్ అనే పేరు కూడా లేకుండా తరిమి కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముందుగానే అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ విద్యాసంస్థలు సహా జన సమూహాలు ఎక్కువగా ఉండే  అన్ని ప్రదేశాలను మూసివేస్తూ  నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో లాక్ డౌన్ కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన లాక్ డౌన్ కూడా తప్పకుండా పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

 

 

 కేవలం చెప్పడమే కాదు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. కరోనా  సోకిన వారికి సమర్థవంతంగా చికిత్స అందించడంతోపాటు... ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు గురించి కూడా ఎన్నో అవగాహన చర్యలు చేపడుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉండకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న ప్రజల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించేలా కెసిఆర్ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. కరోనా  వైరస్ మనల్ని ఏమీ చేయలేదని... తొందరలో కరోనా  వైరస్ ని తరిమి కొట్టపోతున్నాము అంటూ కేసిఆర్ అంటున్నారు. ఇలా భారత దేశ వ్యాప్తంగా కరోనా  యుద్ధంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజేతగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: