కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. వేల సంఖ్యలో మరణాలు, లెక్కకి మించి లక్షల్లో పాజిటివ్ కేసులు, దేశాధినేతలు, ప్రధానులు, మహారాణి, ఇలా ఎవరిని వదలని కరోనా రక్కసి అందరిని కాటేస్తోంది, కలవర పెడుతోంది. అయితే ఈ మహమ్మారి ప్రజలకి సోకకుండా ఉండాలంటే ప్రాధమికంగా చేయాల్సిన పని చేతుల పరిశుభ్రత. సామజిక దూరం. ఈ విషయాన్ని మూడేళ్ళ క్రితం ఓ తెలుగు హీరో చెప్తే అందరూ అతడిని చూసి నవ్వుకున్నారు. వెటకారం చేశారు..కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు హీరోనే ఫాలో అవుతోంది..ఏంటి అర్ధం కాలేదా...అయితే మీరు ఫాలో అవ్వండి...

IHG

2017 సెప్టెంబర్ 18న టాలీవుడ్ హీరో శర్వానంద్ మారుతీ దర్శకత్వంలో “మహానుభావుడు” అనే సినిమా చేశారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా. అవునండి ఆ సినిమాలో హీరో శర్వానంద్ అతి పరిశుభ్రమైన వ్యక్తిగా కనిపిస్తాడు. అతడు ఆ సినిమాలో ఒసీడీ అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా చూపిస్తారు. ఏమి తినాలన్నా, ఏది ముట్టుకోవాలన్నా సరే శానిటైజేషన్ చేతులపై, వస్తువులపై జల్లుతూ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద వహిస్తూ ఉంటాడు. అంతేకాదు పక్క వాళ్ళు చేతులు కడుక్కొక పోయినా శుభ్రంగా లేకపోయినా అతడు పడే ఆరాటం అంతా ఇంతా కాదు...ఆ సినిమాలో శర్వానంద్ ని చూసి అందరూ పడిపడి నవ్వుకున్నారు కూడా..కానీ మూడేళ్ళ తరువాత సీన్ రివర్స్ అయ్యింది...

IHG

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే విధానం ఫాలో అవుతోంది..ప్రతీ ఒక్కరూ శర్వానంద్ లే , అందరూ ఒసీడీ వచ్చిన వాళ్ళలా మారిపోయారు. కరోనా వచ్చిన నేపధ్యం మొదలు మీ ప్రవర్తన ఒక్క సారి రివైండ్ చేసుకోండి. శర్వానంద్ లా ఎన్ని సార్లు శానిటైజేషన్ వాడి ఉంటారు..మీ శుభ్రత కంటే కూడా మీరు మీ పక్క వ్యక్తి శుభ్రత పైనే ఎక్కువగా ఆందోళన చెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా..బయటకి నుంచీ ఇంట్లోకి వస్తువులు తెచ్చినపుడు ఎన్ని సార్లు శానిటైజేషన్ లో ముంచి తేల్చి ఉంటారు. ఆ సినిమాలో కేవలం చేతులు మాత్రమే శుభ్రంగా చేసుకుంటే మనం మాత్రం ముక్కు కి గుడ్డలు కట్టుకుని మరీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిలో భాగమైన ఆహార గొలుసు (ECO ) క్రమం సక్రమంగా జరిగేలా మనమకి మనం వ్యక్తి గత భాద్యత తీసుకుంటే చాలు. భవిష్యత్తు తరాలకి ముక్కుకి గుడ్డలు కట్టుకుని తిరిగే ఇలాంటి బ్రతుకుని ఇద్దామా లేదా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇద్దామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఆలోచించుకోండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: