ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా రోజు రోజుకు మరింత అధికంగా కరోనా వైరస్ కబళిస్తోంది. మొదట్లో కాస్త తక్కువ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు అయినప్పటికీ క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  బారిన పడుతున్న వారి సంఖ్య  పెరిగి పోతుంది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థన కార్యక్రమానికి హాజరైన వారు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఉండడంతో క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్  కూడా కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఎన్నో కీలక నిర్ణయాలను తెరమీదకు తెచ్చి అమలు చేస్తోంది. 

 

 

 పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇతర రాష్ట్రాల వారిని ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి అనుమతించడం లేదు. అయినప్పటికీ కొందరి  నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ.. పూర్తిగా రాష్ట్రాన్ని నిర్బంధంలోకి తెచ్చినప్పటికీ... కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు దీనిని ఆసరాగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

 

 

 ముఖ్యంగా టిడిపి సోషల్ మీడియా అయితే కరోనా  వైరస్ గురించి కాకుండా ఇంకా చంద్రబాబు గురించి  ప్రమోట్ చేయటంలోనే ఎక్కువ చురుకుగా ఉంది  అని పలువురు విశ్లేషకులు కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి  అధికారంలో ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా వైరస్ పెరిగిపోతుందని... కరోనా వైరస్ పెరగకుండా జగన్ సర్కార్ సరైన చర్యలు చేపట్టడం లేదని... ఒక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి విపత్తు తలెత్తేది కాదు అన్నట్లుగా చంద్రబాబునాయుడు సానుభూతిపరులు చెబుతున్నారు. ఇక ఇలాంటి వార్తలు ప్రసారం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు సానుభూతిపరులు వీడియో చాలా చురుకుగా ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: