తెలంగాణ జిల్లాలు మొత్తం కరోనా వైరస్ భయంతో చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే . రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసుల దృశ్య చాలా ఈ మహమ్మారి పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి ఎటు నుంచి దాడి చేసి ప్రాణాలను హరించుకుపోతుందో అనే  భయంతోనే బతుకుతున్నారు. ఇక రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ హడలిపోతున్నారు. కనీసం కాస్త ఎవరైనా దగ్గిన తుమ్మినా  సరే గజగజ వణికిపోవుతున్నారు  . ఎవరి దగ్గర నుంచి కరోనా  వైరస్ సోకుతుందో  అనే భయంతోనే ఉంటున్నారు. 

 

 

 గ్రామాల్లో అయితే కరోనా  వైరస్కు సంబంధించి భయం మరింత ఎక్కువగా ఉంది. గ్రామాలు కాస్త అవగాహన కూడా లేకపోవడం కారణంగా గ్రామాల్లో ప్రజలు మరింతగా వణికిపోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో క్రమక్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న  విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే కరోనా వైరస్ గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కరోనా  వైరస్ విజృంభణ నేపథ్యంలో.. ఆదిలాబాద్లోని మధురానగర్ ప్రజలు తీవ్ర స్థాయిలో భయాందోళనలు నెలకొన్నాయి. 

 

 

 మధుర నగర్ లో సమీపంలో ఉండే 100 నుండి 150 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం ప్రస్తుతం సంచలనంగా  మారిపోయింది. గ్రామ మొత్తం ఖాళీ చేసి తాత్కాలికంగా పంటపొలాలు షెడ్లు వేసుకున్నారు ప్రజలు. ఇక అక్కడే పూర్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోకి అడుగు కూడా పెట్టడం లేదు. ఒక్కరోజులోనే ఆదిలాబాద్ జిల్లాలో పది మందికి కరోనా  సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఈ మహమ్మారి వైరస్ తమ వరకు వస్తుందో అన్న భయంతో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామం నుండి వదిలి వెళ్ళిపోయారు. 

 

 

 కరోనా వైరస్ సోకిన వారి దగ్గర్నుంచి ఇతరులకు కూడా ఎక్కడా కరోనా  వైరస్ సోకుతుందో  అనే భయంతో వణికిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు. నేరడిగొండ మండల కేంద్రంలో ఒకేరోజు ముగ్గురికి కరోనా  వైరస్ నిర్ధారణ అయింది. వారిని వైద్య సిబ్బంది క్వారంటైన్ కి   తరలించారు కూడా. అయితే కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులు ఇంతకుముందు పదిరోజులపాటు నేరేడు కొండ సహా పలు ప్రాంతాల్లో తిరిగారు. కరోనా  వైరస్ సోకిన వారి కారణంగా మరింత మందికి కరోనా వైరస్ బారిన పడతారేమో అనే  భయంతో... మండలంలోని మధుర నగర్ ప్రజలు గ్రామ ప్రజలు  పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: