భారత దేశంలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ..కఠిన  నిబంధన అమలు చేస్తున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం కేసులు పెరిగిపోవడానికి కారణం అవుతున్నది . రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  కేసుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు  వైరస్ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. కరోనా  వైరస్ లక్షణాలు లేనప్పుడు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 దగ్గు జలుబు తీవ్రమైన జ్వరం లాంటివి కరోనా  లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే కేవలం కొన్ని దేశాలకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలు అన్నింటిని కరోనా  వైరస్ బయం కుదిపేస్తోంది. అయితే కరోనా వైరస్  ను  నియంత్రించేందుకు అందరూ ఇంట్లో మాత్రమే ఉండాలని...కరోనా  లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నప్పటికీ ... కొద్దిమంది మాత్రం ఎవరు ఊహించని విధంగా కరోనా  వైరస్ వ్యాప్తికి కాలు దువ్వుతున్నారు. ఓ వ్యక్తి అలాంటి పని చేశాడు. కడప జిల్లా మైదుకూరు మండలం లో గ్రామానికి చెందిన యువకుడు... పట్టణంలోని రాయల్ సర్కిల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ కు  వెళ్ళాడు. 

 

 

 

 లోపలికి వెళ్లి ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుని సైలెంట్ గా బయటికి రాకుండా... అక్కడ పిచ్చి పిచ్చి చేష్టలు చేశాడు ఆ యువకుడు. అక్కడికి వెళ్లి ఏటీఎం డిస్ప్ ప్లే  సహా నెంబర్ బోర్డు  తదితరాలపై లాలాజలాన్ని పూసాడు సదరు యువకుడు.ఇది  గమనించిన అక్కడే ఉన్న కొంతమంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.  అతన్ని  అరెస్టు చేసి స్టేషన్ తీసుకువెళ్లారు పోలీసులు. వైద్యులు  ఆ యువకుడికి పరీక్షలు జరిపించారు. ఆ యువకుడికి జలుబు దగ్గుతో పాటు తీవ్రమైన జ్వరం కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది కరోనా వైరస్ లక్షణాలు కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్యాంకుకు సమాచారం అందించి ఏటీఎంలను  మూసివేశారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ యువకుడు పై కేసు నమోదు చేసిన పోలీసులు కఠిన  చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: