కరోనా నేపధ్యంలో ప్రతి మనిషి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. తగిన విధంగా కరోనాను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కడ ఈ కరోనా అసలు ఆగడం లేదుగా.. ముఖ్యంగా ఇంట్లో ఉండి కరోనా నుండి కాపాడుకోండని చెబుతుంటే వినకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు కొందరు..

 

 

ఇక కరోనా కష్టాలు ప్రతి వారిని తాకుతున్నాయి.. ఒకరేమిటి దీనికి ఏ భేధం లేదు.. అందరు నా వారే అనుకుంటూ, చిన్నా పెద్ద.. పేద ధనిక ఇలా అందరిని పలకరించుకుంటు వెళ్లుతుంది.. ఈ క్రమంలో డాక్టర్స్‌కు, పోలీసు వారికి కరోనాను కట్టడి చేయడాం అనే విషయంలో తలప్రాణం తోకకు వస్తుంది.. అన్నట్లుగా ఉంది.. ఇక ఎవరు ఏ వైపు నుండి కరోనాను అంటపెడతారో, ఎవరు ఆరోగ్య వంతులో, అనారోగ్యంగా ఉన్నారో తెలుసుకోవడం కొంచెం కష్టం.. ఇలాంటి పరిస్దితుల్లో బ్యాంకులో పనిచేసే వారి పరిస్దితి కాస్త బాధగా అనిపిస్తుంది.. అందుకే ఒక బ్యాంకు ఉద్యోగి కరోనాను చంపే కొత్త టెక్నిక్ వాడుతున్నాడు..

 

 

ఇది అందరికి తెలిసిందే కానీ దీన్ని ఇలా కూడా వాడవచ్చా అని ఇప్పుడు చూసాక అనుకుంటారు.. కరోనా వైరస్‌ను చంపేస్తున్న బ్యాంకు ఉద్యోగి అంటే నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఈ వీడియో చూడాల్సిందే. చెక్కుల ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని భావించిన ఈ వ్యక్తి.. కొత్తగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదే ఇస్త్రీపెట్టె. చెక్కులకు వైరస్ అంటుకుని ఉంటే.. ఇస్త్రీపెట్టె వేడికి చనిపోతాయనే నమ్మకంతో ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ఇది నిజమో కాదో తెలియదు గానీ ఈ రోజుల్లో ఎవరు జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు.. ఉండాలి కూడా లేదంటే మనం ఉండం.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: