అమెరికాలో వైద్య వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంటుందనే పేరుంది. వైద్యరంగం మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. క్షణాల్లో ఎమర్జెన్సీ సేవలు అందుతాయక్కడ.! కానీ కరోనా విషయంలో మాత్రం అమెరికా వైద్యవ్యవస్థ మొత్తం చేతులెత్తేసింది. పరీక్షలు చేయడంలో ఆలస్యం చేసింది.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది.

 

వ్యాధిని సరైన సమయంలో గుర్తించినప్పుడే సరైన చికిత్స చేసేందుకు వీలవుతుంది. ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అమెరికా లాంటి తోపు దేశాలకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ కరోనాను ఎదుర్కొనే విషయంలో మాత్రం అమెరికా సరైన సమయంలో స్పందించలేదు. కనీసం రోగులకు పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమైంది.

 

ముందుగా మేల్కోకపోవడం వల్లే అమెరికాలో ఇప్పుడు భారీ నష్టం జరుగుతోంది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కరోనా తీవ్రతను ముందుగానే పసిగట్టి అర్థం చేసుకోవడం వల్లే పరీక్షలు ముమ్మరం చేశాయి. దీంతో అక్కడ వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంది. అత్యాధునిక వైద్య వ్యవస్థ ఉన్నా అమెరికా ఈ విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది.

 

కార్చిచ్చు ఇంటిని దహించేంతవరకూ వరకూ వెయిట్‌ చేస్తే ఇల్లు కాలి బూడిదవడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతోంది.. వైరస్‌ వ్యాప్తి దేశంలో ఎలా ఉంది.. దాని తీవ్రత ఉండే అవకాశం ఉంది .. లాంటి అంశాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేయగలగాలి. అందుకు తగ్గట్లు నివారణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. వైరస్‌ వ్యాపిస్తున్న తీరును కానీ, వ్యాధి లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించడంలో కానీ ట్రంప్ సర్కార్‌ దారుణంగా విఫలమైంది. 

 

న్యూయార్క్‌ లాంటి నగరాన్ని కరోనా వైరస్‌ కమ్మేయోబోతోదనే విషయాన్ని కూడా ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనేదానిపై తగిన ప్లాన్ కూడా ట్రంప్‌ దగ్గర లేదు. దీంతో టెస్టింగ్‌ కిట్స్‌, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని సమకూర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈలోపే వ్యాధి అమాంతం పెరిగిపోతూ వచ్చింది.

 

మార్చి నెలాఖరునాటికి 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని ట్రంప్ సర్కార్‌ మొదటి వారంలో ప్రకటించింది. అయితే మార్చి నెలాఖరు నాటికి 10 లక్షల మందికి కూడా టెస్టులు చేయలేకపోయింది. మిగిలిన దేశాలతో పోల్చినప్పుడు అమెరికా ఎక్కువే చేసినా.. జనాభాకు తగ్గట్లు, వ్యాధి తీవ్రతకు తగ్గట్లు చేయడంలో మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది.

 

చివర్లో ఒక్కసారిగా వచ్చి పడిన శాంపిల్స్‌ను పరీక్షించడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. దీంతో ఫలితాలు రావడం ఆలస్యమైంది. ఈ లోపే పలువురు ప్రాణాలు కోల్పోయారు. త్వరగా రిజల్ట్స్ వచ్చి ఉంటే పాజిటివ్‌ రోగులకు కనీసం చికిత్స అందించేందుకైనా వీలుండేది. కానీ అలా జరగలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: