దేశంలో కరోనా ఎఫెక్ట్ రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇటీవల   ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో కొంత మంది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు.  వారు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత కరోనా వ్యాప్తి బీభత్సంగా పెరిగిపోవడం ఆరంభిచింది.  తెలుగు రాష్ట్రాలో ఈ కరోనా వ్యాప్తికి పరోక్షంగా వారు కూడా కారణం అని అంటున్నారు.  కాగా, గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారని స్వచ్చందంగా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు.. మత పెద్దలతో మాట్లాడారు. 

 

తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మలేషియా వెళ్లడానికి ప్రయత్నించిన ఎనిమిది మంది మలేషియా వాసులను పోలీసులు అరెస్టు చేశారు.  వీరంతా గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారేనని తెలిసింది. ఆ సభకు హాజరైన వారికి కరోనా సోకడంతో అందరూ క్వారంటైన్‌కు రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది మంది మలేషియా వాసులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు కనపడకుండా తలదాచుకున్నారు.  వారి సెల్‌ఫోన్‌ డేటాలను పోలీసులు ట్రేస్‌ చేయగా ఈ విషయం బయటపడింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి వారంతా మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు.  ఈ రోజు వారంతా బయటకు వచ్చి విమానాశ్రయంలో చిక్కారు.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: