లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశం మొత్తం క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ సంస్ధ‌లు అన్ని మూత‌ప‌డ్డాయి.ప్ర‌జ‌లంతా త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దేశంలోని రాజ‌కీయ పార్టీలు అన్ని  కూడా త‌మ కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే మావోయిస్టు పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టార్గెట్ ల‌ను భౌతికంగా నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన యాక్ష‌న్ ప్లాన్ కమిటీకి కాస్త వి రామం ప్ర‌క‌టించింది.  యాక్ష‌న్ ప్లాన్ అమ‌లుపై స్వీయ నిర్బంధం ప్ర‌క‌టించింది. ఈమేర‌కు కోరాపుట్‌-విశాఖ‌- కార్య‌ద‌ర్శి కైలాసం పేరిట  ఆదివారం సాయంత్రం ఒక లేఖ‌తో పాటు ఆడియో టేపును విడుద‌ల చేశారు. ఈ మేర‌కు పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను అందులో వెల్ల‌డించారు.  లాక్ డౌన్ నేప‌థ్యంలో యాక్ష‌న్ ప్లాన్ అమ‌లును మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు నిర్ణ‌యించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో పోలీసుల నుంచి దాడులు జ‌రిగితే మాత్రం ప్ర‌తిదాడులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: