దేశంలో కరోనా రోజు రోజుకా విజృంభిస్తుంది.  ముఖ్యంగా కేరళా, కర్ణాటక, మహరాష్ట్రలో ఇది తీవ్ర రూపంలో ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకీ పెరిగిపోతుంది.  అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు ఈ విషయం పై పర్యవేక్షణ జరుపుతూనే ఉన్నారు.  గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారికే ఈ కరోనా ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఆ సభకు హాజరైన వారికి కరోనా సోకడంతో అందరూ క్వారంటైన్‌కు రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 

 రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఆసుపత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, సంబంధిత లక్షణాలతో వచ్చినవారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ జమాత్ కు వెళ్లొచ్చినవాళ్లు, వారు కలిసిన వ్యక్తులకు త్వరగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. 

 

 కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని.. సాద్యమైనంత వరకు కరోనాని తరిమికొట్టే ప్రయత్నం చేయాలని అన్నారు. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: