తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే . తెలంగాణ ప్రజానీకం మొత్తం కరోనా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఎంతోమందిని కబళిస్తూ  మృత్యు ఒడిలోకి చేరుస్తుంది  మహమ్మారి కరోనా  వైరస్. రోజురోజుకు మహమ్మారి కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్న  తరుణంలో తెలంగాణ ప్రజానీకం ఏం చేయాలి అన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కరోనా  వైరస్ ను  నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నో కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే క్రమక్రమంగా దేశంలో కరోనా  వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి  సంఖ్య పెరిగిపోతుంది. జాగ్రత్తలు తీసుకున్న ... కరోనా వైరస్  మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోతున్నది  అయితే కరోనా  వైరస్ పై  ఎంతో మంది ప్రముఖులు స్పందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ధైర్యం చెబుతున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని దృఢసంకల్పంతో కరోనా  వైరస్ ను  ఎదుర్కోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ పై  మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. 

 

 

 కరోనా  వైరస్ సోకి మరణించిన వారందరినీ అమరవీరుల తో పోల్చారు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. కరోనా  వైరస్ సోకి మృత్యువుతో పోరాటం చేసి మరణించిన  అమరవీరుల తో సమానం అంటూ తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ... ఈ మహమ్మారి వైరస్ కారణంగా మరణించిన వారి మృతదేహాలను వేరు వేరు మతాల  ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేయాల్సిన అవసరం లేదు అని సూచించారు. అమరవీరుల పార్థివదేహాన్ని గౌరవించినట్లు గానే... వైరస్ బారినపడి మృతి చెందినవారి మృతదేహాలను శుద్ధి చేయడం ప్రపంచ కఫమ్  చేయాలి అంటూ కోరారు అసదుద్దీన్ ఓవైసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: