తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అల‌ర్ట్‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కరోనా వ్యాప్తి నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంత‌రం విలేక‌రుల స‌మావేశం ఉండ‌నుంది. అనంత‌రం, ఆయ‌న దీపాలు వెలిగించనున్నారు.  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న కుటుంబ స‌భ్యులతో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 272 కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 228 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 33 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ కాగా, కరోనాతో రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. మ‌రోవైపు, రాష్ట్రంలోని వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరోనా వైరస్‌ పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, ఆశా వర్కర్లను బెదిరిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  

ఈ స‌మావేశం అనంత‌రం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష మొద‌లుపెట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో అధికారులు మంత్రులు పాల్గొన్నారు. ఈ విలేక‌రుల స‌మావేశం అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఇచ్చిన పిలుపుమేర‌కు దీపాలు వెలిగించే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, కీల‌క‌మైన ఈ దీపారాధ‌న స‌మ‌యంలో రోనాపై రాజకీయ ప్రముఖులతో ప్రధాని మోదీ చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడలకు ప్రస్తుత పరిస్థితిపై వివరించి సలహాలు సూచనలు అడిగారు. ప్రతిపక్ష నాయకులు సోనియాగాంధీ, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్‌, స్టాలిన్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని వారితో చర్చించి ఆయా రాష్ర్టాల పరిస్థితులను అడిగి తెలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: