రోజురోజుకు రాష్ట్రంలో విస్త‌రిస్తున్న క‌రోనా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఊపీరి పీల్చుకోనిస్తుందా..? ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌నంతగా ఉధృత‌మ‌వుతుందా..? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే మాత్రం మ‌రో 48గంట‌లు ఆగితే గాని స‌మాధానం దొర‌క‌దు.  వ్యాధి బారిన ప‌డిన  అత్య‌ధికుల్లో ఏప్రిల్ 7లోపే క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ భావిస్తోంది.  విదేశాల నుంచి వచ్చినవారు, ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నవారు, ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు.. ఇలా వివిధ కోణాల్లో వైరస్ రావడానికి ఆస్కారం ఉన్న అన్ని దారులకూ ఈ నెల 7వ తేదీ నాటికి 14 రోజుల గడువు పూర్తవుతుంది. అందుకే ఏప్రిల్ 7న ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న దానిపైనా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల్లో టెన్ష‌న్ క్రియేట‌వుతోంది. 

 

కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో రానున్న రెండు రోజులు అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఇప్ప‌టికే వైద్య ఆరోగ్యశాఖ ముంద‌స్తుగా జిల్లాల్లో సైతం విస్తృత‌స్థాయి ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. అయితే హైద‌రాబాద్ ప‌రిధిలోనే వ్యాధి ప్ర‌బ‌లి ఉంది. జిల్లాల్లో త‌క్కువ కేసులు న‌మోద‌య్యాయ‌ని నిర్ల‌క్ష్యం వ‌హించ‌కూడద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ అధికారుల‌ను హెచ్చ‌రించారు. ఈ రెండు రోజుల్లో నమోదయ్యే పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏస్తాయిలో ఉందో ప్రభుత్వం ఒక అంచనాకు రానుంది. 

 

రెండు రోజుల్లో కొత్త కేసుల న‌మోదు జ‌ర‌గ‌కుంటే ఇక కరోనాకు బ్రేకులు పడినట్లేనని భావించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పిన ‘కరోనా-ఫ్రీ తెలంగాణ’గా రాష్ట్రం అవ‌త‌రిస్తుంద‌ని వ్యాఖ్యనిస్తున్నారు. అయితే గ‌తంలో ప్ర‌భుత్వ‌, వైద్య వ‌ర్గాలు పేర్కొన్న‌ట్లుగా కాకుండా క‌రోనా ఉధృతి క‌నిపించింది. ఈ నాలుగైదు రోజుల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన విష‌యాన్ని కొంత‌మంది గుర్తు చేస్తూ అంత ఈజీగా క‌రోనాను జ‌యించ‌లేం అంటూ హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 272కు చేరుకుంది. ఇంకా సుమారు 800 నమూనాల రిపోర్టు రావాల్సి ఉన్నందున కొత్త పాజిటివ్ కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: