కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో ఆకలి కేకలు ఎక్కువ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ప్రమాదకర స్థితిలో పడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఉద్యోగాలు లేక ఉపాధి లేక పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకోని పరిణామంగా ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దారుణంగా దేశంలో ఎవరూ ఊహించనంతగా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజల నుండి ఐశ్వర్యవంతులు వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే డబ్బున్న వాళ్ళ ఇంటిలో డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉన్న ఏ రోజుకి ఆ రోజు బతికే కుటుంబాలలో లాక్ డౌన్ ఎఫెక్ట్ చాలా గట్టిగా కనబడుతుంది.

 

ముఖ్యంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస కార్మికుల రూపంలో వెళ్లేవాళ్లు అక్కడ పనులు లేకపోవడంతో వేరేచోట ఇరుక్కోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొందరు ఉత్తరాది నుండి దక్షిణాదిన పనులకు కూడా వచ్చి ఉన్నారు.

 

ఇటువంటి తరుణంలో చాలామంది రవాణా అన్ని ఆగిపోవడంతో కాలినడకన తమ రాష్ట్రాలకు వెళ్తున్నారు. కొందరు చివరి వరకు వెళ్తున్నా మరి కొందరు దారి మధ్యలోనే గుండె ఆగిపోయి ఆహారం నీళ్లు లేక ప్రాణాలు విడిచి పెడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు వలస కార్మికుల కోసం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయగా మరికొన్ని రాష్ట్రాలలో షెల్టర్ ఇచ్చి, ఆహరం పెడుతున్నారు. ఏదిఏమైనా కరోనా ఎఫెక్ట్ తో వలస కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మరియు ప్రమాదకరంగా ఉంది అని చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: