పై ఫొటోలో వాళ్ళెవరో తెలుసా ?  రాజధాని అమరావతి  గ్రామాల్లోని మందడం జనాలు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా కొన్ని గ్రామాల ప్రజలను చంద్రబాబునాయుడు రంగంలోకి దింపారు. తాను వెనకుండి గ్రామాల్లోని కొందరు జనాలకు పెయిడ్ ఆర్టిస్టులను జతచేసి ఆందోళనల పేరుతో కొద్ది రోజులు చాలా హడావుడే చేశాడు. కొద్ది రోజులు ఉద్యమ విరాళాల పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జోలె పట్టుకు తిరిగాడు.

 

ఇంతలో కరోనా వైరస్ సమస్య మొదలైంది. సమస్య మొదలైన కొద్ది రోజుల నుండి చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయాడు. ఆందోళనలను విరమించవద్దని వీళ్ళకు చెబుతూ తాను మాత్రం విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చి కుటుంబంతో కూర్చున్నాడు. అంటే తన భవనంలో తన కుటుంబంతో సేఫ్ గా ఉండాలి, గ్రామస్తులు మాత్రం ఏ సమస్యల్లో  ఇరుక్కున్నా పర్వాలేదు. తనకు మద్దతుగా ఉండే మీడియాలో కరోనా వైరస్ ను కూడా లెక్క చేయని రాజధాని గ్రామస్తులని, 100 రోజుకు అమరావతి గ్రామాల ఉద్యమం అని, ధైర్యంగా కరోనా వైరస్ ను ఎదిరిస్తున్న అమరావతి ఉద్యమకారులంటూ పదే పదే ప్రసారాలు చేయిస్తున్నాడు.

 

కరోనా వైరస్ సమస్యల్లో కూడా రాజధాని గ్రామాల్లోని జనాలు తమ ఉద్యమాన్ని విడవకుండా ఉద్యమాలు చేస్తునే ఉన్నారని యావత్ రాష్ట్రం అనుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే రాజధాని సమస్యలతో మిగితా జిల్లాల జనాలు ఎమోషనల్ గా కనెక్టవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అయినా సరే వీళ్ళను మాత్రం ఉద్యమబాట నుండి పక్కకు పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు.

 

ఇక్కడ ఓ విషయం అందరికీ స్పష్టమైపోయింది. కరోనా సమస్య గనుక లేకపోయుంటే ఈ పాటికే రాజధాని విశాఖపట్నంకు తరలిపోయుండేదే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే మార్చి 25వ తేదీకి ముఖ్యమంత్రి విశాఖపట్నం నుండే పనిచేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. జగన్ ఏదైనా విషయంలో నిర్ణయానికి వస్తే ఆగడని చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అయినా సరే జనాలను ముందు పెట్టి ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: