గడచిన రెండు వారాలుగా తెలంగాణాలో  మీడియా  ముఖ్యమంత్రి కేసియార్ విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవహారంపైన కానీ నోరెత్తటం లేదు. దేశం మొత్తాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సమస్య తెలంగాణా రాష్ట్రంలో కూడా మొదలైంది. మొదట్లో కేసియార్ వైరస్ ను చాలా తేలిగ్గానే తీసుకున్నాడు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైరస్ నియంత్రణకు, వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యల గురించి చాలా సీరియస్ గానే చెప్పారు. దాంతో ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది.

 

దాదాపు రెండు వారాలుగా తెలంగాణాలో కరోనా వైరస్ తప్ప మరో విషయమే ప్రస్తావనకు రావటం లేదు ఎక్కడ కూడా. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిజానికి ఏపితో పోల్చిచూస్తే తెలంగాణాలో చాలా లోపాలున్నాయి. అయినా ప్రతిపక్షాలు ఆ విషయాలపై అస్సలు  మాట్లాడటమే లేదు. అదే సమయంలో మీడియా కూడా నోరెత్తటం లేదు. అలాగే ఏపిలో వైరస్ వ్యాపించకుండా జగన్ చాలే గట్టి చర్యలు తీసుకుంటున్నాడు.

 

అయితే అక్కడక్కడ బయటపడుతున్న చిన్న చిన్న లోపాలను పట్టుకుని ప్రతిపక్షాలైన టిడిపి, బిజెపి, సిపిఐ, జనసేన నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిరోజు మీడియాలో నానా యాగీ చేస్తున్నది అందరూ చూస్తున్నదే. ఇక చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచే మీడియా అయితే జగన్ పై రెచ్చిపోయి కథనాలు ఇస్తోంది. మరి ఇదే మీడియా తెలంగాణా విషయంలో ఎందుకని గాంధారి వ్రతం ఆచరిస్తోంది ? ఎందుకంటే కేసియార్ అంటే భయం వల్లేనా ?  

 

కేసియార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ఒకసారి అనుభవంలోకి వచ్చింది. కేసియార్ దెబ్బకు ఇద్దరు  మీడియా యాజమానులకు  షాక్ తగలటంతో మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్త పడ్డారు.  అప్పటి నుండి కేసియార్ కు ఎక్కడా ఇబ్బంది రాకుండా వార్తలు, కథనాలు ఇస్తున్నారు మీడియా వాళ్ళు. ఏమైనా కేసియార్ గట్టోడని అందరూ ఒప్పుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: