కరోనా అనే వైరస్ రూపంలో ఉన్న పాము బుసలు కొడుతూ పడగలు విప్పుతోంది. ప్రపంచ మానవాళిని కాటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలో ఉన్నాయి. ఇక ఈ విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ ఏపీని కూడా అతలాకుతలం చేస్తోంది. మొదట్లో కరోనా వైరస్ ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించ లేదు. దీనికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు బాగా పనిచేశాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనను కూడా ఏపీలో కఠినంగా అమలు చేశారు జగన్. అయినా ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరగడంతో జగన్ ప్రభుత్వం పై రాజకీయ ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.

 

IHG

 జగన్ సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ఏపీలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందిందని, అలాగే ఈ నిబంధనల కారణంగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నా.. జగన్ సరైన విధంగా స్పందించడం లేదని, అలాగే ఏపీకి చెందిన వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చిక్కుకుని ఆకలితో ఉన్నా, జగన్ పట్టించుకోవడం లేదని ఇలా అనేక రకాల విమర్శలు జగన్ ను చుట్టుముట్టాయి. వైసిపి రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం మరింతగా జగన్ పై విమర్శలు చేసింది. జగన్ సీఎంగా విఫలం అయ్యారని, పదవిలో ఉండేందుకు ఆయన అర్హుడు కాదని విమర్శలు చేసింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే సోషల్ మీడియాలో జగన్ తీరుపై టీడీపీ అనుకూల వర్గీయులు వ్యతిరేక కథనాలు పోస్ట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు.

 

IHG

 నిజంగానే జగన్ పనితీరు అంతంతమాత్రంగానే ఉందా...? కరోనా ను కంట్రోల్ చేసే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారా అని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. వాస్తవంగా చెప్పుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో కరోనా వైరస్ కట్టడి చేసే విషయంలో జగన్ ముందు జాగ్రత్తగానే వ్యవహరించారు అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు తెలంగాణ పోలీసుల ద్వారా అనుమతి పొందిన సుమారు 20 వేల మందిని జగన్ ఏపీ లోకి అనుమతించకుండా సరిహద్దు చెక్ పోస్టు వద్ద నిలిపివేశారు. అయితే అదే సమయంలో వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారికి హాస్టల్లోని వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని... అవసరమైతే దానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉంది అంటూ జగన్ కోరారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ తాము ఇచ్చిన అనుమతి పత్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా కేటీఆర్ రంగంలోకి దిగి హాస్టల్ యజమానులను పిలిపించి వసతి ఏర్పాటు చేయాలని, దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తోందంటూ ప్రకటించారు. దీంతో ఏపీకి కాస్త ఊరట లభించినట్లయింది.

 

IHG

 నిబంధనలు ప్రకారం  రోడ్లపై జనాలు సంచరించే సమయాన్ని కూడా జగన్ బాగా తగ్గించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల్లోపు మాత్రమే ఎవరైనా రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇస్తున్నామని, మిగతా సమయంలో అత్యవసర విధులు నిర్వహించే వారు తప్ప మిగతా ఎవరు రోడ్లపై తిరిగేందుకు అనుమతి లేదు అంటూ పోలీస్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. ఇటు వంటి చర్యలతో ఏపీలో అతి తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా అకస్మాత్తుగా ఢిల్లీ లోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి ద్వారా  ఏపీలో ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. ఇప్పటి వరకు 236 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జగన్ ప్రభుత్వం పై రాజకీయ ప్రత్యర్థులు మరింత విమర్శలు మొదలుపెట్టారు. అయితే ప్రజల్లో మాత్రం జగన్ చేపట్టిన చర్యల పై ప్రశంసలు కురుస్తున్నాయి.

 

IHG's help to ...

 

 ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందని, ఇందులో జగన్ చేసిన తప్పు ఏమీ లేదనే విషయాన్ని ప్రజలు గ్రహించారు. వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు ఎవరు  ఇబ్బంది పడకుండా, అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తాజాగా నిన్నటి నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు అలాగే, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెయ్యి రూపాయల చొప్పున వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించే ఏర్పాటు చేశారు. దీంతో జగన్ పరిపాలన పై ప్రజల్లో మరింత ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందని, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు దీని కారణంగా ఇబ్బంది పడుతున్నారని, ఇందులో జగన్ తప్పు ఏమీ లేదు అనే విషయాన్ని ప్రజలు మేధావులు గుర్తిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు తగిన సలహాలు , సూచనలు ఇవ్వాల్సిన రాజకీయ వర్గాలు ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవాదాన్ని కూడా అందరూ తప్పు పడుతున్నారు. 

 

IHG

కష్టం వచ్చినప్పుడు కులాలు ,మతాలు, పార్టీలకు అతీతంగా ఏకమై ఆపద నుంచి గట్టెక్కాలి తప్ప ఇలా, సమయం సందర్భం లేకుండా విమర్శలు చేయడం తగదని సూచనలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే కరోనా వైరస్ వ్యవహారం విషయంలో జగన్ తీరు పై ప్రశంసలు వస్తున్నాయి, తప్ప పెద్దగా విమర్శలు అయితే వస్తున్నట్టుగా కనిపించడం లేదు. అసలు ఈ ఆపద సమయంలో జగన్ తీరును తప్పుపట్టడానికి కూడా ఆస్కారం కనిపించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: