కరోనా దెబ్బకు ఎక్కడవి అక్కడ బంద్ అయిపోయిన విషయం తెలిసిందే. దేశమంతా పూర్తిగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎమర్జన్సీ సేవలు తప్ప, మిగతా సేవలు అన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా హళ్ళు, షాపింగ్ మాల్స్ లాక్ డౌన్ కంటే ముందే క్లోజ్ అయిపోయాయి. భారతదేశంలో కరోనా నిదానంగా ప్రభావం చూపిసున్న సమయంలోనే జన సాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్లు, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ మూతబడిపోయాయి.

 

అయితే తర్వాత ప్రధాని జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చి ఆ వెంటనే, 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దేశంలో అన్నీ రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ కఠినంగా పాటిస్తున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు ప్రజలకు కొంత సమయం ఇచ్చారు.  ఇంకా ఎమర్జన్సీ సేవలకు తప్ప దేనికి బయటకెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు.

 

కాగా, ఇప్పటికీ లాక్ డౌన్ మొదలయ్యి 12 రోజులు పూర్తయ్యింది. ఇంకా 9 రోజుల్లో  అంటే ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి యథావిధిగా నడవనుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ పూర్తి కాగానే, సినిమా హళ్ళు ఓపెన్ చేస్తామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే  లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తగిన జాగ్రత్తలతో తమ థియేటర్లను నడిపిస్తామని పీవీఆర్ సంస్థ వాళ్ళు చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

అయితే ఇక్కడొక సమస్య ఉంది. రోజురోజుకూ కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14కు తీసేస్తారా? లేదా కొనసాగిస్తారా? దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా, ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తారా? అంటే కష్టమనే చెప్పాలి. ఈ కరోనా దెబ్బకు జనం ఇప్పటిలో థియేటర్లకు వెళ్ళే అవకాశం తక్కువ. పైగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటివి అందుబాటులో ఉన్న సమయంలో ప్రజలు ఇప్పుడే థియేటర్లు వైపు కన్నెత్తి చూడకపోవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: