దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అసలు రాజకీయం అన్నదే లేకుండా పోతోంది. రాజకీయ నాయకుల మధ్య ఉన్న గోడలు క్రమంగా కుప్పకూలిపోతున్నాయి. తరతరాలుగా వారి మధ్య ఉన్న అంతరాలు అన్నీ మసకబారుతున్నాయి. సమయంలో అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రధాని మోదీ కరోనా పై పోరులో భాగంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన ప్రతిపక్ష పార్టీ నేతల నుండి కూడా సలహాలు తీసుకునే దిశగా ఒక మంచి ముందడుగు వేశారు.

 

క్రమంలో ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లకు ఫోన్ చేసి మాట్లాడటం విశేషం. అలాగే బిజెపికి వ్యతిరేక పార్టీలకు చెందిన చాలా వాటి అగ్ర నాయకులతో మోదీ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడా ఇప్పుడు నేషనల్ మీడియా వెల్లడిస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ తో పాటు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు కూడా ఫోన్ చేసి కరోనా వ్యాప్తిని నిరోధించడంలో వారి సలహాలను ప్రధాని కోరినట్లు సమాచారం.

 

అలాగే సోనియా గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పంజాబ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు కూడా వ్యక్తిగతంగా ప్రధాని ఫోన్ చేసి కరోనాపై సలహాలు కోరారు.

 

ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని సైతం పోరులో భాగం చేయడం అన్నది మాత్రం మోడీ ఇమేజ్‌ను భారీగా పెంచే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: