ప్రపంచంలో కరోనా వైరస్ చేస్తున్న బీభత్సం ఎంత భీకరంగా ఉంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  వేలాది ప్రాణాలను బలిగొంటున్న కొత్త రకం వైరస్ కరోనా.. భారతదేశంలో కూడా ప్రబలుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు 500 దాటాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి 3,500 దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  త‌మిళ‌నాడులో క‌రోనా వేగంగా వ్యాప్తిస్తుంది. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 86 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాదు.

 

వీరిలో 85 మంది మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ మ‌త‌ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారేన‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి బీలా రాజేష్ తెలిపారు.   కొత్త‌గా న‌మోదైన 86 కేసులతో క‌లిపి త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 571 కి చేరింద‌ని ఆమె చెప్పారు. ఈ 571 కేసుల్లోనూ 522 మంది ఢిల్లీ మ‌త ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారేన‌ని బీలా రాజేష్ వెల్లడించారు.    ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌లే త‌మిళ‌నాడు స‌హా అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగ‌డానికి కారణం అవుతున్న విషయ తెలిసిందే. 

 

కాగా, ప్రపంచవ్యాప్తంగా 12,25,022 మందికి ఈ వైరస్ సోకింది. వీటిలో అమెరికా నుంచే 3లక్షలపైగా కరోనా కేసులున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా స్పెయిన్(1,30,759), ఇటలీ(1,24,623), జర్మనీ(97,074) ఉన్నాయి. కరోనా పుట్టిల్లయిన చైనా ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది.  కరోనా వల్ల రోజు రోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: