ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు  బాగా పెరిగి పోతున్నాయి. ఇందులో అధికంగా కర్నూల్ జిల్లాలో రెండు, మూడు రోజుల నుండి అధిక సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది. తాజాగా ఆంధ్రాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కి చేరింది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు 26 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగినిదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించడం జరిగింది. 

 


ఇది ఇలా ఉండగా మరో వైపు ఆంధ్రాలో కరోనా వ్యాప్తి నివారణ కోసం ఏపీ సర్కార్ పటిష్ట చర్యలు చేపడుతున్న కూడా కేసుల సంఖ్య పెరగడం ప్రజలలో కలకలం రేపుతుంది. ఇక కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన 26 కరోనా కేసులు ఒక్క కర్నూల్ జిల్లా నుంచే అవ్వడం కర్నూల్ జిల్లా వాసులలో భయాందోళనలు రేపుతుంది. వీరు అందరు కూడా మత ప్రచారం కోసం వెళ్లిన వారే అని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరుకు తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరు కోలుకోవడం జరిగింది అని  ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరి అందరిని కూడా ఆస్పత్రుల నుంచి  వారి ఇళ్లకు డిశ్చార్జి కూడా చేయడం జరిగింది. ఇలా ఒక్క సరిగా కేసులు పెరగడంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రెడ్ జోన్ లాగా ప్రకటించడం కూడా జరిగింది.

 


తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు తెలుసుకుందామా మరి..! రాష్ట్రంలోని కేసుల పూర్తి వివరాలు ఇలా...


అనంతపూర్ - 3, 
చిత్తూరు - 17,
తూర్పుగోదావరి - 11, 
గుంటూరు - 30,
కడప - 23,
కర్నూలు - 53, 
కృష్ణా - 28, 
నెల్లూరు - 34,
ప్రకాశం - 23, 
విశాఖపట్నం - 15,
పశ్చిమగోదావరి - 15,
విజయనగరం - 0,
శ్రీకాకుళం - 0.

 

మరింత సమాచారం తెలుసుకోండి: