యావత్ భారతం దీపాల వెలుగులో మెరిసిపోయింది. నిండు వెన్నల మాదిరి ప్రతీ ఇల్లు కూడా దీపాల వెలుగులో మెరిసిపోయింది. హిందు సాంప్రదాయంలో దీపాలు వెలిగిస్తే ఇతర మతాల వాళ్ళు కొవ్వొత్తులు వెలిగించారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారత దేశం సరిగా 9 గంటలకు ప్రతీ ఇంట్లో దీపం వెలిగింది. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తమ తమ ఇంట్లో దీపాలు వెలిగించారు. 

 

దీపాలతో యావత్ భారతావని వెలిగిపోయింది. ఇతర దేశాల్లో కూడా భారతీయులు ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో ప్రతీ ఇల్లు ప్రతీ ఊరు ప్రతీ నగరం ప్రతీ జిల్లా ప్రతీ రాష్ట్రం, ఉత్తరాది, దక్షినాది అనే తేడా లేకుండా దీపాలు వెలిగించి భారతీయులు అందరూ కూడా దీపాలు వెలిగించారు. గో కరోనా అంటూ నినాదాలు చేసారు. దీపకాంతుల తో కరోనా పై పోరాటం చేస్తున్నారు ప్రజలు. 

 

రాజకీయాలకు అతీతంగా దీపాలను వెలిగించారు. మీడియా ప్రముఖులు కూడా ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. 130 కోట్ల మంది దీపాలు వెలిగించడం తో ప్రపంచం మొత్తం జయహో భారత్ అంటుంది. కోయంబత్తూరు ఇషా యోగా కేంద్రంలో జగ్గీ వాసుదేవ్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్లు కూడా దీపాలు వెలిగించారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో ప్రజలు అందరూ కూడా ముందుకి రావడం నిజంగా అభినందనీయం...

మరింత సమాచారం తెలుసుకోండి: