ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి సంఘీభావం తెల‌పాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం రాత్రి రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలంటూ 'దియా జాలో' అని ప్రధాని నరేంద్ర మోదీ నినందించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు అంతా ఆదివారం రాత్రి ఇళ్ల‌ల్లో లైట్లు ఆర్పేసి దీప‌పు కాంతులు వెలిగించాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే మోదీ పిలుపు అందుకున్న భార‌తావ‌ని రాత్రి 9గంటలు కాగానే ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పివేసి ఎవరికి నచ్చిన విధంగా వారు కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ ఫోన్‌ లైట్లు, మరికొంత మంది ప్రమిదలతో తన ఐక్యత భావాన్ని చాటారు. 

 

వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం త‌మ ఇళ్ల‌ల్లో విద్యుత్ దీపాలు ఆర్పేసి క‌రోనాపై పోరాటం చేస్తోన్న వారికి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్ త‌న‌తో పాటు ఏపీ అధికారుల‌తో దీపాలు వెలిగించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులతో కలిసి ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజభవన్‌లో కొవ్వొత్తితో కరోనాపై పోరాటానికి తన వంతుగా సంఘీభావం తెలిపారు. ఏదేమైనా దేశం అంత‌టా మ‌రోసారి దీప‌పు వెలుగుల‌తో ఐక్య‌త చూపించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: