సాధారణంగా చట్టం ముందు అందరూ సమానమే, అదేవిధంగా రాజ్యాంగం ముందు అందరూ సమానమే అన్ని రాజకీయ నాయకులు చాలా దేశాలలో బహిరంగంగా తమ ప్రసంగాలలో ప్రసంగిస్తూ ఉంటారు. అయితే చేతల్లోకి వచ్చేసరికి చట్టం ఒకరికి చుట్టం లాగా అదేవిధంగా రాజ్యాంగం మరొకరికి రాజరికం లాగా ఉండే పరిస్థితులు కళ్ళముందు కనబడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయింది భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మనిషి జాతిలో చిట్ట చివరన ఉండే పేదవాళ్లు మరియు అనగారిన వర్గాలు. ఇటువంటి ప్రపంచంలో మొట్టమొదటిసారి భూమి మీద ఇలాంటి చట్టాలను మరియు రాజ్యాంగాలను పక్కకు తన్ని వైరస్ కి అందరూ సమానమే అని నిరూపించింది కరోనా వైరస్.

 

వాడూ .. వీడూ .. నువ్వూ .. నేను అనే తేడా లేకుండా .. మొత్తం మడతేస్తోంది. ప్రైమ్ మినిస్టర్ నుండి పేదవాడి వరకు అందరూ సమానమే అని కరోనా వైరస్ నిరూపించింది. ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రరాజ్యాల ను తల దించేలా వణుకుపుట్టించే లా కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో వ్యాపించు కుంటూ పోతుంది. నిన్న మొన్నటి వరకు రోడ్లు మీద మరియు బయట హడావిడిగా ఉండే ప్రపంచాన్ని కరోనా వైరస్ నిశ్శబ్దంగా మార్చేసింది.

 

చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో వ్యాపించినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. చాలా వరకు దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ ని కూడా వదలలేదు కరోనా వైరస్. ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ చాలా చట్టాలను రాజ్యాంగాలను జయించి మొట్టమొదటిసారి మనుషులంతా ఒక్కటే అని నిరూపించింది అనే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: