ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎక్కువగా యూరప్ మరియు అమెరికా దేశాలలో విలయ తాండవం చేస్తుంది. ఇటలీ మరియు స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ వల్ల చాలామంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో దీనికి మందు లేకపోవటంతో ప్రపంచ దేశాలు అన్నీ నియంత్రణ ఒకటే మార్గం కావటంతో లాక్ డౌన్ ప్రకటించాయి. మరోపక్క మందు కొనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. ఇటువంటి టైములో దశాబ్దాల క్రితమే కరోనా వ్యాక్సిన్ ఉన్నట్లు అమెరికా మరియు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ వైరస్ కి మందు కనిపెట్టడం కోసం జరుపుతున్న పరిశోధనలో ఎక్కువగా తెలుసుకున్నది ఏమిటంటే టీబీ వంటి బ్యాక్టీరియా - ఇతర వైరస్ లు సోకకుండా వేసే బీసీజీ వ్యాక్యిన్ ఈ వైరస్ ని అడ్డుకోవటానికి బాగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎక్కువగా ఈ వ్యాక్సిన్ భారతీయులు క్షయ మరియు టీబీ వ్యాధి రాకుండా చిన్నప్పుడే బీసీజీ టీకాల రూపంలో వేసుకోవడంతో భారతీయులలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా కనబడటం లేదని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా టీకాల ద్వారానే శ్వాసకోశ వ్యాధుల నుంచి శాశ్వత ఉపశమనం ఉంటుందని పరిశోధకులు నిరూపిస్తున్నారు.

 

ఈ సమయంలో బీసీజీ కరోనా నివారణకు ఒక ఆయుధంగా దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే భారతీయుల చిన్నతనంలోనే వేసుకునే బీసీజీ టీకా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి బాగా దోహదపడుతుందని చాలా పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు చెప్పడం నిజంగా భారతీయులు హర్షించదగ్గ విషయమని చెప్పవచ్చు. ఎప్పటినుండో దశాబ్దాల క్రితమే బీసీజీ టీకా భారతీయ వైద్యరంగంలో చిన్నపిల్లలకు వేయడంతో...కరోనా ప్రభావం ఇండియా పై అంతగా లేదని మరోపక్క శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: