తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతంకరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే దాంతో పనులు లేక  అటు సొంత ఊళ్లకు వెళ్లలేక వలస కూలీలు నానా ఆవస్థలు పడుతున్నారు. అందులో భాగంగా తమిళనాడు నుండి కొందరు కూలీలు బ్రతుకు దెరువు  కోసం ఆంధ్ర వచ్చి లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. పనిలేకపోవడం తో పూట గడవడం కష్టంగా మారింది. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో వారిని అన్ని విధాల ఆదుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది జగన్ సర్కార్. దాంతో జగన్ కు ధన్యవాదాలు తెలిపారు పళనిస్వామి. మావాళ్లను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ పళనిస్వామి ట్వీట్ చేశారు. 
 
 
ఇదిలావుంటే ఈ రెండు రాష్ట్రాల ను కరోనా అతలాకుతలం చేస్తుంది. నిజాముద్దీన్ సంఘటన కారణంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 400 దాటింది ఇందులో 5గురు మరణించారు.కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుంది. మరోవైపు ఆంధ్రాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 252 కు చేరింది. ఇందులో 90 శాతం నిజాముద్దీన్ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చినవారే వున్నారు. ఇక ఓవరాల్ గా ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య 4000 దాటింది ఇందులోఇప్పటివరకు 83 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: