కరోనా వైరస్ వల్ల చాలామంది మనుషులు భూమి మీద చనిపోతున్న సమయంలో ఏపీ రాజకీయ నాయకులు వైసిపి టిడిపి పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సోది కబుర్లను తలపిస్తున్నాయి.  వైరస్ దెబ్బకి ఎన్నడూ లేని విధంగా దేశం అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ వైరస్ వల్ల చాలా వరకు ఆర్థిక మాంద్యం దెబ్బతింది. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మనిషి జీవిత మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రజలను ధైర్య పరుస్తూ మీకు మేము అండగా ఉన్నామని చెప్పే బాధ్యత గల రాజకీయ నాయకులు కనబడటం చాలా అద్భుతంగా ఉంది.

 

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అటువంటి పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. ఏం చేసినా కానీ రాజకీయం కోసం అన్నట్టుగా ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి టైంలో కూడా అటు టీడీపీ వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయితే దొరక్క దొరక్క దొరికిన అన్నట్టుగా జగన్ ని కరోనా వైరస్ విషయాన్ని అడ్డంపెట్టుకుని భయంకరమైన విమర్శలు చేస్తోంది. మరోపక్క అధికార పార్టీ వైసీపీ కూడా కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో చాలా తేలికగా తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొంటోంది.

 

విభజనతో నష్టపోయి మొత్తం అప్పుల తో నిండిపోయిన రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి గా ఎన్నికైన జగన్ ప్రస్తుతం నానా తిప్పలు పడుతున్నారు. ఇటువంటి టైం లో ఒక పక్క వైసీపీ మరో పక్క టిడిపి నాయకులు భయంకరమైన రాజకీయ విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ప్రజలలో కూడా ఏపీ రాజకీయ నేతల అసహనం నెలకొంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో తెలియని వాళ్ళకి రాజకీయ నాయకులకు వ్యవహరిస్తే ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటుంది చాలామంది అధికార ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: