లాక్ డౌన్ నేపధ్యం లో అత్యవసరంగా రోడ్లపైకి వస్తున్న జనాన్ని చితకబాదుతోన్న ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు , రోడ్లపై గుంపులుగా తిరుగుతోన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తలు కన్పించడం లేదా ?అంటూ టీడీఎల్పీ ఉప నేత కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గుంపులుగా ప్రజల ఇళ్లకు వెళ్తూ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన   అన్నారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే , అనర్హత వేటు వేసేందుకు వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్బంగా గుర్తు చేశారు .

 

అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా  మూడేళ్ళ   జైలు శిక్ష , పదివేల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పుకొచ్చిన వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం , ఎందుకనీ కరోనా సహాయం పేరిట అక్రమాలకు పాల్పడుతున్న తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన   ప్రశ్నించారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున  పోటీ చేస్తున్న అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్లుగా నిరూపిస్తే వారిపై చర్యలు తీసుకునే దమ్ము జగన్ సర్కార్ ఉందా? అంటూ నిలదీశారు . కరోనా పేరిట ప్రభుత్వం అందజేస్తోన్న సహాయాన్ని కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తన  రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు .

 

అయితే టీడీపీ నేతల ఆరోపణలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , మంత్రులు తిప్పికొడుతున్నారు . కరోనా కట్టడి చర్యలపై కూడా ప్రతిపక్ష పార్టీ అసత్య ఆరోపణలను చేస్తూ రాజకీయ  పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శిస్తున్నారు . కరోనా కట్టడి కోసం దేశ ప్రధాని  లాక్ డౌన్ ప్రకటించకముందే , పేదల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని గుర్తు చేశారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: