దేశం మొత్తం కరోనాపై పోరాటం చేస్తోంది. అటు ప్రధాన మంత్రి మోడీ.. ఈ అంశంపై చాలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన మోడీ.. ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్‌ ప్రకటించిన సమయం అయిపోతుంది. మరి తర్వాత ఎలా అన్నదే ఇప్పుడు అసలైన చిక్కుప్రశ్న.

 

 

ఓ వైపు కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు శర వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ దేశంలోని ప్రధాన నాయకులతో మాట్లాడుతున్నారు. నాయకులు అనే కాదు.. అన్ని రంగాల వారితో ఆయన చర్చిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌తో మోడీ చర్చించారు.

 

 

ఇదే సమయంలో జగన్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా పై పోరాటంలో రాష్ట్రానికి కావాలసిన సాయన్ని సీఎం జగన్ ప్రధాని మోడీని అడిగినట్టు సమాచారం. కరోనా పై పోరాటానికి రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని జగన్ కోరినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కూడా చర్చకు వచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టింగ్ సౌకర్యాలు మరింత గా కల్పించాల్సిన అవసరం ఉంది. టెస్టింగ్ ల్యాబులు పెంచాలి. వైద్యులకు పీపీఈ కిట్లు మరిన్ని అవసరం. ఈ అంశాలను సీఎం జగన్ మోడీకి వివరించినట్టు తెలిసిందే. మరి జగన్ అడిగిన వాటిలో మోడీ ఎన్ని పట్టించుకుంటారో.. ఎంత సాయం చేస్తారో చూడాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: