ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తాజాగా సర్కారు వెలువరించిన హెల్త్ బులెటిన్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక్కరోజే కర్నూలు జిల్లాలో ఏకంగా 49 కేసులు నిర్ధారణ అయ్యాయి. వాస్తవానికి కర్నూలు జిల్లాలో నిన్నటి వరకు 4 కేసులే ఉన్నాయి. కేవలం రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య 53కి చేరింది. దాంతో ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది.

 

 

ఇలా కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో రెండు రోజులపాటు నిత్యావసరాలను సైతం నిలిపివేయనున్నారు. ఈ జిల్లాలో ప్రజలను తిరగనివ్వకుండా మరిన్ని ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ అనూహ్యంగా ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిన్నటి వరకు ఉన్నది కేవలం 4 కేసులే. ఇది చూసి జిల్లా వాసులు హమ్మయ్య అనుకున్నారు. ఆదివారం ఉదయం ఈ జిల్లాలో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి.

 

 

ఇక సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మరో 26మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ జిల్లాలో కేసుల సంఖ్య 53కి చేరింది. నిన్న మొన్నటి వరకూ పెద్దగా కేసులు నమోదుకాని జిల్లాలో ఇప్పుడు ఏకంగా 53 మంది కరోనా నిర్థరణ కావడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువ కేసులు డిల్లీలోని మత కార్యక్రమానికి వెళ్లిన వారికి సంబంధించినవేనని కూడా అధికారులు చెప్పారు.

 

 

ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో నమోదైన కేసులు మిగిలిన జిల్లాలలూ భయపెడుతున్నాయి. తక్కువ కేసులు ఉన్నాయని నిర్లక్ష్యంగా ఉండకూడదని కేసులు ఎప్పుడైనా బయటపడొచ్చని కర్నూలు జిల్లా ఉదంతం రుజువు చేస్తోంది. జిల్లాలో పరిస్థితి కంట్రోల్‌ తప్పకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: