రెండు రాష్ట్రాలు కూడా మనకు అత్యంత దగ్గరగా ఉన్న రాష్ట్రాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆ రెండు రాష్ట్రాలు తెలుగు వారికి సన్నిహితమే. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను పంచుకున్నాయి ఆ రెండు రాష్ట్రాలు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అవే తమిళనాడు, మహారాష్ట్ర... రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. 

 

ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అర్ధమవుతుంది. తమిళనాడు, మహారాష్ట్రలో ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు ఇప్పుడు దాదాపు 600 కి చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు తెలుగు వారు కూడా ఎక్కువగా భయపడుతున్నారు. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే భయపడుతున్నారు. 

 

నిత్యావసర సరుకులను కూడా అనుమతించే పరిస్థితిలో ప్రజలు లేరు అనేది వాస్తవ౦. తెలంగాణా తో మహారాష్ట్ర సరిహద్దులు పంచుకుని ఉంది. తమిళనాడు తో ఆంధ్రప్రదేశ్ సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు మరాఠా గ్రామాల నుంచి ఎవరిని రానీయడం లేదు. అక్కడ పండే ఉల్లిపాయ కూడా మాకు వద్దు రా బాబు అంటున్నారు ప్రజలు. కరోనా ఏ వస్తువు మీద ఉంటుందో అర్ధం కాని పరిస్థితి దీనితో నిత్యావసర సరుకులు కూడా ఆ రాష్ట్రాల నుంచి వద్దు అని పలువురు కోరడం గమనార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: