ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజల్లో కూడా ఇప్పుడు ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన వ్యక్తమవుతుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. 

 

ప్రతీ రోజు కూడా అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో 300 కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 250 దాటి 300 దిశగా వెళ్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే... రెండు జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు లేవు. తెలంగాణాలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లో వంద కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

ఇప్పుడు తెలంగాణ సర్కార్ ని కూడా ఈ పరిణామం తీవ్రంగా కంగారు పెడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు కరోనా కేసుల విషయంలో చాలా సీరియస్ గా ఉంది తెలంగాణా సర్కార్. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ముందు ఒక విజ్ఞప్తి పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉంచాలని రాష్ట్ర సరిహద్దులను అనుమతిస్తే తాము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే ఆందోళన కేంద్రం ముందు పెట్టాలని భావిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: