అవును ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. శ్రీకాకుళ౦ విజయనగరం మినహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 253 మందిగా ఉంది. 

 

ఇది రాబోయే రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు కొందరి అభిప్రాయం. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ వెనుక కుట్ర ఉందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారని వారి నుంచి కరోనా వైరస్ ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ స్థాయిలో విస్తరించి ఉంటుంది అనే అనుమానాలు వినపడుతున్నాయి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు,  ప్రకాశం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులు ఇప్పుడు చాలా వేగంగా మారుతున్నాయి. 

 

ఈ జిల్లాల్లో ఇప్పుడు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని కరోనా కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దంగా లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బాధితులు పెరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ ఉండకపోవచ్చు అంటున్నారు. రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ కి కీలకమని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: