భారత్లో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో రోజురోజుకు ప్రాణభయం పాతుకు పోతుంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఎవరితో మాట్లాడిన అంతా ప్రాణాంతకమైన కరోనా  వైరస్ భయం. ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలీదు కానీ వస్తే మాత్రం ప్రాణాలను హరించుకుపోతుందేమో అని భయం. అంత భయం భయం. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే భయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చి కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విలయతాండవం మాత్రం ఆపడం లేదు.

 

 

 భారతదేశంలో కరోనా వైరస్  కేసులు ఒక్కసారిగా పెరిగి పోవడానికి కారణం ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్  సమావేశం అనే చెప్పాలి. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ అనే మత ప్రార్థన సభకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లి వచ్చిన చాలామంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రోజురోజుకు భారతదేశంలో కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మార్కజ్  వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కారణంగా ఇంకొంతమందికి కూడా కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారణ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్  అయిపోయింది. ఇప్పటికే చాలామంది మర్కజ్  సమావేశానికి వెళ్లిన వారిని క్వారంటైన్ కి  పంపించింది తెలంగాణ ప్రభుత్వం. 

 

 

 అయినప్పటికీ రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో పోలీసులు మరింతగా అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వేదికగా రోజురోజుకు డేంజర్ బెల్స్  మోగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మర్కజ్  సమావేశానికి వెళ్లిన వారి కోసం జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని క్వారంటైన్ కు  పంపిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలను సంప్రదించి వివరాలు సేకరించి మార్కెట్ కు వెళ్ళిన వారిని గుర్తించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: