దేశంలో రోజురోజుకు ప్రాణాంతకమైన కరోనా వైరస్ కోరలు చాస్తూ ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించింది. ఈ సమయంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తమ బాల్కనీ లేదా గడపల వద్దకు వచ్చి ఇంట్లోని  లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు వెలిగించాలి అంటూ పిలుపునిచ్చారు. మరోసారి భారత ఐక్యతను చాటి కరోనా  వైరస్ ను తరిమి కొట్టేందుకు అందరు సహకరించాలని సూచించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతం చేశారు అనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా... నగరం పట్టణం గ్రామం అనే భేదం లేకుండా ప్రతి చోటా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దీపాల వెలుగులు కనిపించాయి. 

 

 

 మరోసారి భారత ప్రజానీకం మొత్తం భారత ప్రజల ఐక్యతను చాటి చెప్పింది. దీపాలు కొవ్వొత్తులు టార్చి లైట్ లు లాంటివి దేశవ్యాప్తంగా కనిపించాయి . మోడీ పిలుపునిచ్చినట్లు గా కరోనా  వైరస్ పై  పోరాటంలో భాగంగా దీపాలు టార్చ్ లైట్లు వెలిగించారు కానీ ఆ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అదే సామాజిక దూరం. ప్రస్తుతం కరోనా  వైరస్ పై పోరాటంలో భాగంగా సోషల్ డిస్టెన్స్ ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. కానీ చాలా మంది ప్రజలు అది పాటించలేదు. కేవలం ఇంట్లో మాత్రమే ఉండి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ చాలామంది ప్రజలు అక్కడక్కడ రోడ్లపైకి వచ్చి క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు  సైతం నిర్వహించారు. దీంతో లాక్ డౌన్  కాస్త అటకెక్కినట్లయింది . ప్రధాని నరేంద్ర మోడీ ఏం  సూచించారో  అదే మరచి గుంపులుగా గ్రూపులుగా కనింపించారు ప్రజలు. 

 

 

 ఇన్నాళ్ల పాటు ఇంట్లోనే నిర్బంధంగా ఉన్న చాలామంది క్యాండిల్ పట్టుకుని బయటకు వచ్చేస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల కరోనా  వైరస్ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిసినప్పటికీ అక్కడక్కడా కొంతమంది ప్రజలు మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించడం లేరు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విధంగా దేశ ఐక్యమత్యాన్ని చాటటంలో  తప్పులేదు కానీ..ఓ  వైపు దేశ ఐక్యమత్యాన్ని చాటుతూనే మరోవైపు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించి నిబంధనలను పాటిస్తే   బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి సందర్భాల కారణంగానే మరో పది రోజుల తర్వాత కూడా వైరస్ పెరగడానికి కారణం అవుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: