కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై గణనీయంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది. ప్రత్యేకించి గ్లోబలైజేషన్ కారణంగా ఐటీ రంగంపై దీని దెబ్బ బాగానే ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి అమెరికా వంటి దేశాలు కరోనా బారిన పడి అల్లకల్లోలం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

 

తాజాగా ఓ నివేదిక చెప్పిన దాన్నిబట్టి చూస్తే.. హైదరాబాద్ లో లక్ష ఐటి ఉద్యోగాలకు గండం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారాం.. గత మూడు రోజులలోనే రెండు వేల మంది ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చారట. మరికొందరికి కొత్త ప్రాజెక్టు వచ్చే వరకు రావద్దన్న మెస్సేజ్ లు వస్తున్నాయట.

 

 

మొత్తం హైదరాబాద్ లో 1500 వరకూ ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు ఐదు లక్షల మంది వరకూ పని చేస్తున్నట్టు ఓ అంచనా. ఇప్పుడు కరోనా తెచ్చిన ముప్పుతోవీరిలో ఐదో వంతు వరకూ అంటే ఓ లక్ష మంది వరకూ ఉద్యోగాలు కోల్పోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగులకు ఇచ్చిన నియామక పత్రాలను పెండింగ్‌లో పెట్టేశాయి. అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చిన సంస్థలు కూడా తర్వాత చూద్దామంటూ సందేశాలు పంపుతున్నట్టు తెలిసింది.

 

 

ఇది కరోనా కాలం అని చెప్పుకునే గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. ఇలా ఎంతకాలం కష్టకాలం ఉంటుందన్న దానిపై కూడా ఓ అంచనాకు రావడం కష్టమవుతోంది. కరోనాను ఎంత త్వరగా కట్టడి చేయగలిగితే అప్పుడే ప్రపంచం మళ్లీ యథాస్థితికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ శుభవేళ ఎప్పుడో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: